‘టార్గెట్ పవన్’ వెనుక గుట్టు విప్పిన కమల్!

reason-behind-kamaal-khan-comments-on-pawan-kalyanగత రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మండిపడుతున్న బాలీవుడ్ ప్రముఖుడు కమల్ ఖాన్… వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అర్ధం కాక పవన్ అభిమానులు తలలు పట్టుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా పవన్ పై ఈ రేంజ్ లో వ్యాఖ్యలు చేయడం పట్ల కారణం అర్ధం కాక మదనపడుతున్న అభిమాన గణానికి తాజాగా జవాబు చెప్పారు కమల్ ఖాన్.

“చాలా మంది నటులు తమను కలవడానికి వచ్చిన వారితో నటిస్తూ ఉంటారని, అలాగే తామేదో దేవుళ్ళు మాదిరి భావిస్తారని… అలాంటి వారి మీద నా ఎటాక్ ఉంటుందని, అలాంటి వారి నిజ స్వరూపాన్ని బయట పెడతానని” తాజాగా ట్వీట్ చేసారు. ఇక్కడ పవన్ పేరు ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుతం కమల్ ఎటాక్ చేస్తోంది పవన్ నే గనుక, పవర్ స్టార్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కమల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే… అంటే బహుశా పవన్ కళ్యాణ్ ను ఇటీవల కమల్ ఖాన్ ఇంటర్వ్యూ అడిగి ఉంటాడని, అది కుదరక పోవడంతో పవన్ పై విమర్శలు చేస్తూ చెలరేగిపోయి ఉంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

ADVERTISEMENT

“సీ గ్రేడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ అభిమానులారా… నా మీద ఎటాకింగ్ తగ్గించండి… మీరు ఎంత ఎటాక్ చేస్తే నేను అంత పెద్దవాడిని అయిపోతాను… జస్ట్ షటప్…” అంటూ మరోసారి ఘాటుగా కూడా స్పందించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నందమూరి బాలకృష్ణ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్ తో సరిపెట్టుకుని… కమల్ ఖాన్ ఉదంతాన్ని వదిలిపెట్టేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories