సెంటిమెంట్ కు సినీ ఇండస్ట్రీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు నాలుగు వాయిదాలు పడిన “ఆర్ఆర్ఆర్”కు సంబంధించి అలాంటి సెంటిమెంటే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కారణాలు ఏదైనా “ఆర్ఆర్ఆర్” వాయిదా వెనుక ఉన్న రహస్యం “5” అని దీని సారాంశం.
మొట్టమొదటగా “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ – 30.07.2020. దీని మొత్తం కుడితే నెంబర్ శాస్త్ర ప్రకారం వచ్చే సంఖ్య 5. అలాగే రెండవ విడుదల తేదీ 08.01.2021 – ఈ తేదీ మొత్తం కూడా 5. ఇక మూడవ డేట్ దీనికి కొంచెం భిన్నం 13-10-2021, ఈ మొత్తం సంఖ్య 1. ఇక తాజాగా వాయిదా పడిన తేదీ 07-01-2022, ఈ రిలీజ్ డేట్ మొత్తం లెక్కిస్తే తేలిన సంఖ్య 5.
బహుశా “ఆర్ఆర్ఆర్”ను తెరకెక్కించిన రాజమౌళి కూడా దీనిని చూసుకున్నారో లేదో గానీ, న్యూమరాలజీ ప్రకారం మూడు సార్లు 5 టోటల్ వచ్చిన విడుదల తేదీలతో “ఆర్ఆర్ఆర్” వాయిదా పడింది. కాకతాళీయమే కావచ్చు గాన, ఈ సారి మాత్రం ఈ న్యూమరాలజీని కూడా పరిగణనలోనికి తీసుకుని రిలీజ్ డేట్ ను ప్రకటించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
ఈ సారి డేట్ టోటల్ చేస్తే వచ్చే సంఖ్య 5 గానీ, 1 గానీ లేకుండా చూసుకోమని జక్కన్నకు సోషల్ మీడియా వేదికగా సూచనలు వెళ్తున్నాయి. ఈ విషయం రాజమౌళి దాకా వెళితే నిజంగానే ఈ సారి ఆ రెండు అంకెలకు ఆమడ దూరంగా వెళ్ళిపోతారేమో! మరీ ముఖ్యంగా 5 అంకెతో జక్కన్నకు ఎలాంటి అనుబంధం ఉందో గానీ, ‘ఆర్ఆర్ఆర్’ను మాత్రం మూడేళ్ళుగా వెన్నాడుతోంది.



