
మహాయోధుడు కర్ణుడు చావుకి వంద కారణాలన్నట్లు, తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ ఓటమికి కారణాలు అనేకం ఉండవచ్చు కానీ కారకుడు మాత్రం ఒక్కరే! ఆయనే సిఎం కేసీఆర్.
బిఆర్ఎస్ పార్టీకి బలం, బలహీనత రెండూ ఆయనే కనుక ఈ గెలుపోటములకు క్రెడిట్, డెబిట్ కూడా ఆయన పద్దులోనే వ్రాయాల్సి ఉంటుంది. బిఆర్ఎస్ ఓటమికి కారణాల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా కొన్ని చెప్పుకోక తప్పదు.
· కేసీఆర్ అహంభావం. నిరంకుశ పోకడలు.
· అన్ని నాకు మాత్రమే తెలుసనే అతిశయం. ఈ గుణాల వలన ఎవరితోను కలవలేకపోవడం.
· ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు, మీడియా పట్ల చులకనభావం.
· మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడం. వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుండటం.
· కుటుంబ పాలన… లెక్కకు మించి అవినీతి ఆరోపణలపై నిశితంగా స్పందించకపోవడం.
· అభివృద్ధి పేరుతో పేదరైతుల భూములను స్వాధీనం చేసుకోవడం. వారి కష్టాలను కన్నీళ్ళను పట్టించుకోకుండా వందల కోట్లు ఖర్చు చేసి రాజమహల్స్ వంటి విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం.
· ఉద్యోగాల భర్తీని కూడా ఎన్నికల కోసం వినియోగించుకోవాలనుకొంటూ, మూడేళ్ళుగా ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా సాగదీస్తూ నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించడం.
· టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి కారణంగా లక్షలాది నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావడం.
· ప్రధాని మోడీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితర ప్రముఖుల పట్ల అనుచితంగా వ్యవహరించడం.
· మోడీతో, బీజేపీతో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ లోపాయికారి ఒప్పందాలు చేసుకొంటుండటం.
· ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్ళపై జరిగిన ఐటి దాడులతో బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్ వాదనలు బలంగా ప్రజలలోకి వెళ్ళడం.
· కాంగ్రెస్ శక్తియుక్తులను తేలికగా అంచనా వేయడం.
· మార్పు రావలనే నినాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం.
· టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించకపోవడం వలన ఆంధ్రా ఓటర్లకు ఆగ్రహం కలగడం.
· చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా హైటెక్ సిటీ వద్ద ఐటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నప్పుడు, మంత్రి కేటీఆర్ చులకనగా మాట్లాడటం కూడా ఆంధ్రా ఓటర్లకు ఆగ్రహం కలిగించి ఉండవచ్చు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతగా అభివృద్ధి చేశారో చెప్పేందుకు ఒక పుస్తకం వ్రాయాల్సి ఉంటుంది.అలాగే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలన్నీ చెప్పుకోవాలంటే ఓ పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీ విజయాలన్నీ కేసీఆర్‌కే సొంతమనుకొన్నప్పుడు దాని వైఫల్యాలు, అపజయాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కనుక ప్రధానంగా కేసీఆర్ వైఖరి వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పక తప్పదు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…