“బూతులు, రౌడీయిజం” అప్పుడే మానేసా అన్న హీరోయిన్!

Regina-about-her-behaviourముద్దుగా, బొద్దుగా వెండితెరపై అందాల విందు చేసే హీరోయిన్ బూతులు తిట్టడమేంటి… రౌడీయిజం చేయడమేంటి..? దీని గురించే ‘లిప్ లాక్’ భామ రెజీనా చెప్పుకొచ్చింది. తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్ తో పోటీ గురించి ప్రస్తావించిన సమయంలో… రెజీనా తన రౌడీయిజం ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పింది.

“పోటీ గురించి మీడియా వాళ్ళు పట్టించుకున్నట్లుగా నేను పట్టించుకోనని, తనకు ఫేస్ టు ఫేస్ కాంపిటీషన్ మాత్రమే నమ్ముతానని, క్లాసులో తానూ రెండవ ర్యాంక్ వస్తే దానిని పోటీగా ఫీలవ్వను గానీ, బాస్కెట్ బాల్ పోటీలో ఓడిపోతే దానిని పోటీగా భావిస్తానని చెప్పిన రెజీనా, తన స్కూల్ సమయంలో బాస్కెట్ బాల్ పోటీలో ఓడిపోతే వచ్చే బూతులు, చేసే రౌడీయిజం సాధారణంగా ఉండేది కాదని, అయితే అవన్నీ అప్పుడే వదిలేసానని” చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

రకుల్ నటించిన సినిమాలలో “నాన్నకు ప్రేమతో” సినిమా తప్ప ఏమీ చూడలేదని, తామిద్దరం ఒక చోటే ఉంటే సినిమాలకు వెళ్తామని… అలా అలా తన స్నేహితురాలు రకుల్ తో ఉన్న సాన్నిహిత్యం గురించిన విశేషాలను, అనుభూతులను పంచుకుంది ‘మెగా’ ముద్ర పడ్డ రెజీనా.

ADVERTISEMENT
Latest Stories