తెలుగులో లిప్ లాక్ బ్యూటీగా పేరుగాంచిన రెజీనా ప్రస్తుతం తమిళంలో “మిస్టర్ చంద్రమౌళి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 6వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ ఊపందుకుంది. ఇందులో భాగంగా ఈ సినిమాలో హాట్ సాంగ్ గా ప్రచారం జరుగుతోన్న ‘ఏదేదో అనెనే’ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేసింది.
ADVERTISEMENT
బీచ్ లో చిత్రీకరించిన ఈ పాటలో రెజీనా సొగసులు వీక్షకులకు కన్నులవిందు చేస్తున్నాయి. గతంలో కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో కూడా ఈ రేంజ్ లో అందాల విందు చేయలేదనేది నెటిజన్ల మాట. అయితే రిలీజ్ కు ముందే ఇలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడం అనేది కేవలం ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించడానికేనా? లేక సినిమాలో విషయం ఉందా? అనేది జూలై 6 తర్వాత తెలియనుంది.
ADVERTISEMENT



