పవన్ అభిమానులకు విన్నపాలు!

Renu Desai Request to pawan kalyan fansసోషల్ మీడియాలో పవన్ అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! తమ అభిమాన నటుడి గురించి ఏ చిన్న సమాచారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనా… పాజిటివ్ గా ఉంటే లైక్ లు కొడుతూ షేర్ చేసుకుంటూ ఉంటారు, అదే నెగటివ్ అయితే ఆ సమాచారాన్ని పెట్టిన వారికి కౌంటర్లు వేస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యవహరించడం వలన కొందరు ఇబ్బంది పడుతున్నారు అనేది… ఒకప్పటి పవన్ భార్య రేణుదేశాయ్ ఉదంతంలో నిరూపణ అవుతోంది.

ADVERTISEMENT

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయవద్దని, పవన్ పై అభిమానం ఎప్పుడూ ఉంటుందని, అయితే పవన్-తాను కలిసే ప్రసక్తి లేదని గత కొన్నేళ్ళుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పలు ఇంటర్వ్యూల ద్వారా చెప్తూనే వస్తున్నప్పటికీ, అభిమానులు మాత్రం రేణుకు ట్వీట్లు చేయకుండా మానడం లేదు. ముఖ్యంగా పవన్ ను గుర్తు చేసుకుంటూ ఏదొక ఫోటోను పోస్ట్ చేసిన సమయంలో అభిమానులు స్పందిస్తున్న భాష రేణుదేశాయ్ కు ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో మరోసారి పూర్తి వివరణ ఇచ్చుకుంటూ ఫేస్ బుక్ వేదికగా ఓ సుదీర్ఘమైన లేఖ రాసింది.

“నాలుగేళ్లుగా ఫేస్‌ బుక్, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూల్లో, సోషల్‌ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్‌ పెడుతున్నాను….

మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కళ్యాణ్ గారు నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ… నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదే పదే కోరుకోవద్దు.

దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే, కళ్యాణ్ గారికి భార్య ‘ఆనా’ మాత్రమే, నేను కాదు, ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ, ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను.

మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ.. నమస్కారం” అంటూ ఒక సుదీర్ఘమైన లేఖను విజ్ఞప్తితో అభిమానులకు రేణు రాసింది. దీనిపై పాజిటివ్ స్పందన రావడం రేణుదేశాయ్ కు ఊరటనిచ్చే అంశం.

అసలు విషయం ఏమిటంటే… ఇదంతా తెలుగులో రేణు రాయడం..!

ADVERTISEMENT
Latest Stories