సస్పెన్స్’ ఇంకా కొనసాగిస్తూనే ఉంది!

Renu-Desai-Surprise-Pic-with-Her-Fiance!త్వరలో మరో ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న రేణుదేశాయ్, తన భర్త ఫోటోను రివీల్ చేసే విషయంలో సస్పెన్స్ ను అలాగే కొనసాగిస్తోంది. ఎంగేజ్మెంట్ జరిగిన రోజున ఫేస్ కనిపించకుండా పిక్ ను పోస్ట్ చేసిన రేణు, కాబోయే శ్రీవారు, పిల్లలతో కలిసి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అకీరా పోస్ట్ చేసిన ఫోటోలో రేణు భర్తను బ్యాక్ నుండే చూపించింది.

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సృష్టిస్తోన్న హంగామాతో భయపడడం వలనే రేణు తన భర్త ఫోటోను బయటపెట్టలేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలిపింది. అయితే ఆ ఇంటర్వ్యూ తర్వాత పవన్ ఫ్యాన్స్ మరింతగా చెలరేగడంతో, ఇప్పట్లో ఈ సస్పెన్స్ కు తెరపడేలా కనపడడం లేదు. ఏది ఏమైతేనేం… ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీ కలిసి రేణు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరుతోంది.

ADVERTISEMENT

https://www.instagram.com/p/BlMAIZfhdeS/?taken-by=renuudesai

ADVERTISEMENT
Latest Stories