రేవంత్ రెడ్డి టీడీపీని వీడటం కాంగ్రెస్ లో జాయిన్ కావడంకూడా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎలా వాడుకుంటుందో చూడాలి మరి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను గద్దె దించడం అనే సింగల్ పాయింట్ ఎజెండా తో రేవంత్ పని చెయ్యనున్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి తెరాసలో కూడా పని చేసారా? అవును అంటుంది సోషల్ మీడియాలో హుల్ చల్ చేస్తున్న ఒక ఫోటో
ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుని కొందరి తెరాస నాయకులతో ఫోజ్ ఇస్తున్నారు. 2006లో రేవంత్ జడ్పీటీసీగా గెలిచినప్పటి ఫోటో ఇది. అయితే ఈ ఫోటో లో ఒక తిరకాసు ఉందని రేవంత్ ఫాన్స్ అంటున్నారు. 2006లో రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గ జడ్పీటీసీ గా గెలిచారు.
అప్పట్లో రేవంత్ తెరాస మెంబెర్ కాదుగాని ఆ పార్టీ రేవంత్ కు సపోర్ట్ చేసిందట ఆ ఎన్నికలో. ఆ ప్రచారంలో భాగంగా రేవంత్ గులాబీ కండువా కప్పుకున్నారు కానీ ఆయన ఎప్పుడు ఆ పార్టీలో జాయిన్ కాలేదని రేవంత్ రెడ్డి ఫాన్స్ అంటున్నారు. మరోవైపు వచ్ఛే 6 నెలల్లో ఎప్పుడైనా కొడంగల్ ఉపఎన్నిక రావొచ్చు అదే రేవంత్ కు తొలి పరీక్ష


