రేవంత్ రెడ్డి తీరే వేరప్పా…!

Revanth reddy fires on KCRప్రత్యర్ధులను ఏకిపారేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ‘లాజిక్ లతో కూడిన మాటలతో మ్యాజిక్ చేయడం’ టీ-టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆరితేరినవారు. ప్రస్తుతం ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడుతుండగా, ఎవరు వెళ్ళినా, వెళ్లకున్నా, రేవంత్ రెడ్డి మాత్రం టిడిపితోనే ఉంటారన్న నమ్మకం అందరిలోనూ ఉంది. నిజానికి తొలుత సిఎం కేసీఆర్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ రేవంత్ తోనే ప్రారంభించారని, దానికి లొంగకపోవడం వల్లనే ‘ఓటుకు నోటు’ కేసు ఏర్పడిందని పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటుంటాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకోగా… ఇక మాటల్లో కాక, చేతల్లో చేయాలని అనుకున్నారో ఏమో గానీ ఉన్నట్లుండి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించారు రేవంత్.

కరీంనగర్ జిల్లాలోని చిన్నముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకుని, ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. స్వయానా ముఖ్యమంత్రే దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలు నిజంగానే మారిపోతాయని గ్రామ ప్రజలు భావించారు. దీంతో ఆ గ్రామంలో పర్యటించిన రేవంత్ రెడ్డి… అక్కడ జరుగుతున్న పలు కార్యక్రమాలను నిశితంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చేసిన స్థాయిలో పనులు లేకపోవడం పట్ల స్థానిక వాసులతో భేటీ అయ్యి, కీలక సమాచారాన్ని రాబట్టారు. రేవంత్ రెడ్డి చర్యలు ఒక్క టీఆర్ఎస్ నేతలనే కాక సొంత పార్టీ టీ-టీడీపీకి చెందిన నేతలకు కూడా షాక్ ఇచ్చింది.

ADVERTISEMENT

టీ-టీడీఎల్పీ నేతగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణాలో పార్టీ భారం మొత్తం రేవంత్ రెడ్డిపైనే పడడంతో, ఎలాగైనా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే లక్ష్యంలో భాగంగానే రేవంత్ ఈ రకమైన దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories