కాంగ్రెస్లో చంద్రబాబు ఫాన్స్ అసోసియేషన్ పెట్టేలా ఉన్నాడు రేవంత్!

revanth-reddy-tdp-ts-resign-telanganaఇంకా అధికారికంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోకముందే సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌ నిర్వహించిన ‘ఆత్మీయులతో మాట-ముచ్చట’ సభకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఉత్తమ్‌తోపాటు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా రేవంత్‌ సభలో పాల్గొనడం గమనార్హం

కాంగ్రెస్ పెద్దల ముందే రేవంత్ రెడ్డి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు ప్రజల కోసం మరి ముఖ్యంగా తెలంగాణా ప్రజల కోసం ప్రధాని పదవి సైతం చంద్రబాబు వదులుకున్నారని, అమరావతిలో ఆంధ్ర ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడుతున్నారు ఆయన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని రేవంత్ రెడ్డి ఉత్తమ్ సమక్షంలోనే చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఒకానొక సందర్భంలో రేవంత్ దానిని చంద్రబాబు అభినందన సభగా మార్చివేశారు ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుగానే. చంద్రబాబు నాయుడుని తన అభిమాన నాయకుడు, అత్యంత ఇష్టమైన నాయుడుగా అభివర్ణించారు రేవంత్. పక్క రాష్ట్రంలో మరియు కేంద్రం లో అధికారం ఉన్న అవేమి వద్ధు అని కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరానని రేవంత్ చెప్పుకొచ్చారు.

భాజపా నుండి అనేక ఆహ్వానాలు ఉన్నా తాను ప్రతిపక్షంలో ఉండటానికే ఇష్టపడుతున్నా అని రేవంత్ అన్నారు. ఈ రోజు సాయంత్రం నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి. రేపు(మంగళవారం) రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి అధికారికంగా చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ ముఖ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరతారు.

ADVERTISEMENT
Latest Stories