
రేవంత్ రెడ్డి మైత్రి వనం సాక్షిగా టీడీపీ – కాంగ్రెస్ పార్టీల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ వైరానికి ముగింపు పలికారా.? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే చెప్పాలి. నిన్న రాత్రి హైద్రాబాద్ లోని అమీర్ పేట లోని మైత్రి వనం లో టీడీపీ స్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణలో టీడీపీ ఇప్పటికి రాజకీయంగా నాయకత్వ లోపంతో వెనుకబడే ఉంది. ఆ లోపమే గత ఎన్నికలలో టి. టీడీపీ ని కాంగ్రెస్ నేత అయిన రేవంత్ వైపు నిలబడేలా చేసింది. ఇందుకు ఒకపక్క గతంలో టీడీపీ కి రేవంత్ కి ఉన్న రాజకీయ సంబంధాలు కారణంగా కాగా మరోపక్క ఆయనకు టీడీపీ అధినేత బాబు తో ఉన్న తత్సబంధాలు మరో కారణమయ్యాయి.
గత ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపులో టి.టీడీపీ మద్దతుదారుల పాత్ర కీలకం అనేది జగమెరిగిన సత్యమే. అలాగే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో సైతం దశాబ్దాల కాంగ్రెస్ కల ను నిజం చేసేలా బిఆర్ఎస్ ఏకచక్రాధిపత్యానికి శుభం కార్డు పడింది. జూబ్లీహిల్స్ వంటి కీలక స్థానంలో కాంగ్రెస్ గెలుపు అంటే అందులో సింహ భాగం టీడీపీ మద్దతుదారుల ఓటు బ్యాంకు ఉంటుంది.
ఇలా రేవంత్ ప్రతి విజయం వెనుక కనపడని ఒక అదృశ్య శక్తిలా టి. టీడీపీ రేవంత్ ను రాజకీయంగా కాపు కాస్తూ వస్తుంది. అందుకు గాను రేవంత్ కూడా టి. టీడీపీ మద్దతుదారులకు, సానుభూతిపరులకు ఒక బలమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా అమీర్ పేట మైత్రి వనంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
అసలు కాంగ్రెస్ దశాబ్దాల రాజకీయ ఏకచక్రాధిపత్యానికి ముగింపు పలకడానికి, కాంగ్రెస్ కి రాజకీయ ప్రత్యామ్నాయం గా ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ ని ప్రారంభించిన 9 నెలలలోనే అధికారంలోకి తెచ్చారు, కాంగ్రెస్ అధికారానికి తెలుగు వాడి ఆత్మగౌరవం అనే కంచె వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ చరిత్రకు తెరలేపారు ఎన్టీఆర్.
అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ఏర్పాటు చేయడం, అందుకు టి.కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అధిష్టానం వరకు ఎవరు నోరెత్తకపోవడం నిజంగా రేవంత్ రాజకీయ చతురతకు అద్దం పడుతుందనే చెప్పాలి. దీనితో మైత్రి వనం సాక్షిగా రేవంత్ తెలంగాణ రాజకీయాలలో, కాంగ్రెస్ రాజకీయ ప్రయాణంలో మరోకొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టయ్యింది.
తన రాజకీయ భవిష్యత్ కు బలమైన రాజకీయ పునాదులు వేసిన టీడీపీ రాజకీయ సాయాన్ని రేవంత్ ఇప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు, అలాగే టీడీపీ అధినేత నుంచి ఆ పార్టీ కార్యకర్తల వరకు వారి పై తనకున్న ఆప్యాతను, ప్రేమను వివరిస్తూనే వస్తున్నారు. దీనివల్ల రేవంత్ పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా రాజకీయ లబ్ది పొందుతున్నారు. తనకంటూ ఇటు పార్టీ పరంగా కాంగ్రెస్ బాల్మతో పాటుగా అటు వ్యక్తిగతంగా టీడీపీ మద్దతును రేవంత్ సొంతం చేసుకోగలుగుతున్నారు.
ఇక ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా రేవంత్ చేసిన ప్రసంగం ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతల నోటికి కూడా కళ్లెం వేసిందని చెప్పాలి. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి తుమ్మల, మాధవ్ రెడ్డి, కడియం శ్రీహరి, మోతుకపల్లి, దేవేంద్ర గౌడ్ ఇలా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని , అందనంత ఒక చెరపలేని చరిత్ర అంటూ ఎన్టీఆర్ పై తనకునన్న అభిమానాన్ని, గౌరవాన్ని రేవంత్ మరోసారి చాటిచెప్పారు.
రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో, ఆ ఏర్పాటు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంతో మొత్తానికి టీడీపీ మద్దతుదారుల మనసు గెలుచుకున్నారు. వీడెక్కడున్న మనవాడేరా అనే నమ్మకాన్ని టీడీపీ క్యాడర్ లో కలిగించడంలో పుర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి దీని ఇంపాక్ట్ రేవంత్ కు ఎంతకాలం రాజకీయంగా అండగా నిలబడుతుందో చూడాలి..!
Mumbai Indians had produced some of the brightest talents in Indian cricket in the form…
Veteran producer Vashu Bhagnani has invited another trouble for himself and his production house, Pooja…