డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..కొరివితో తలా గోక్కుంటున్నాడేమో అని ఎన్ఠీఆర్..టీడీపీ పార్టీ అభిమానులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు..అయితే అసలు వర్మ చేసే పనులను కాస్త క్లుప్తంగా గమనిస్తే ఆయన పనుల్లో లాజిక్ ఈజీగా అర్ధం అయిపోతుంది..మన పని మనకు సులువు అయిపోతుంది..
[m9ad]
వర్మ ఏం చేసినా మీడియాకి లీక్స్ ఇస్తాడు..అయితే మీడియా దాన్ని హైలైట్ చేసి
చూపించడమే వర్మకు కావలసింది..లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమాలో వెన్నుపోటు పాట అంటూ రచ్చ రచ్చ చేసిన వర్మ..ఇప్పుడు తాజాగా కొందరు సీనియర్ పాత్రికేయులతో మీట్ అయినట్లు..ఆ సమయంలోనే మీడియాకి లీక్స్ ఇచ్చాడు..
అయితే ఆరోజుల్లో ఎన్ఠీఆర్…చంద్రబాబు..పార్టీ చేతులు మారడం.ఇలా జరిగిన పరిణామాల విషయంలో మీడియా పాత్ర చాల బలంగా ఉంది..ఆ పాయింట్ ని ఆధారంగా చేసుకుని వర్మ వారిని ఒక బడా స్టార్ హోటల్ లో కలసి ఆరోజుల్లో జరిగిన ఆఫ్ ది రికార్డు మ్యాటర్స్ గురించి అసలు మ్యాటర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అయితే వర్మ ఇదంతా మీడియా అట్టెన్షన్ కోసం..సినిమా హైప్ కోసమే చేస్తున్నాడు అని..ఇదంతా హడావిడే తప్పా…సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉండదు అనేది కొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా వర్మ తన టాలెంట్ తో ప్రేక్షకుల అట్టెన్షన్ ని తన వైపు తిప్పుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు..మరి సినిమా నిజంగా నిజాలతో ఉంటుందో..లేక గత చరిత్రలలాగా ఊపి ఊపి..ఉసూరు మనిపిస్తాడో చూడాలి.



