షాకింగ్ : రజనీకాంత్ కిడ్నాప్ కోసం ప్రయత్నాలు!

Ram-Gopal-Varma-Rajinikanth-Veerappanమూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్, తన హవా నడుస్తున్న సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కిడ్నాప్ చేయాలని భావించాడని, అందుకు భారీ ఎత్తున ప్రణాళికను కూడా రూపొందించుకున్నాడని దర్శకుడు రాంగోపాల్ వర్మ బయట పెట్టిన విషయాలు సంచలనమయ్యాయి. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ రూపొందించిన చిత్రం హిందీలో 27వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

వీరప్పన్ కు, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం నడిపిన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, రజనీకాంత్ కిడ్నాప్ కు ప్లాన్ వేసినట్టు తెలిసిందని పేర్కొన్నారు. అయితే రజనీ కిడ్నాప్ అంత సులభం కాదని తెలుసుకున్న తరువాతనే, అదే ప్లాన్ కన్నడ స్టార్ రాజ్ కుమార్ పై అమలు చేశాడని తెలిపారు. “నేను సేకరించిన వాస్తవాల ప్రకారం, వీరప్పన్ కథ నమ్మశక్యం కానిది. అంతకన్నా నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, వీరప్పన్ ను చంపడానికి ప్రభుత్వాలు వేసిన ప్రణాళికల వెనుక వున్న డ్రామా” అన్నారు వర్మ.

పబ్లిసిటీ కోసం పరితపిస్తారనే నానుడి ఉన్న వర్మ, అందులో భాగంగానే రజనీకాంత్ పేరు లేవనేత్తారా..? లేక నిజంగానే రజనీ కిడ్నాప్ కోసం వీరప్పన్ చేసిన ప్రయత్నాలను సినిమాలో చూపిస్తారా అన్నది విడుదలైతే గానీ తెలియని విషయం. అయితే మరోసారి బాలీవుడ్ సినీ వర్గాలను తన వైపుకు తిప్పుకోవడానికి ‘వీరప్పన్’ సినిమా ద్వారా వర్మ ప్రయత్నాలు చేస్తున్నారని ట్రేడ్ వర్గీయులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories