పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ‘హీరోయిన్’

Rimi Sen In BJP Politicsటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన ‘అందరివాడు’ సినిమాలో నటించిన హీరోయిన్ రిమీ సేన్ రాజకీయ రంగ ప్రవేశం చేసింది. బాలీవుడ్‌ లో ‘ధూమ్’ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బీజేపీలో చేరింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ ‑వర్గీయ సమక్షంలో రిమీ సేన్ బీజేపీ కండువా కప్పుకుంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రచారంలో రిమీ సేన్ ను వినియోగించుకుంటామని స్పష్టం చేసారు. ఇక, రిమీ సేన్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపింది. సినిమాల్లో కంటే 2015 లో రియాల్టీ షో బిగ్ బాస్-9 ‑లో పాల్గొనడం ద్వారా ఎక్కువ ఆదరణను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories