ఒక్క మ్యాచ్ ఫలితం… మూడు జట్ల నిరీక్షణ..!

Rising Pune Supergiant VS Kings XI Punjabలీగ్ మ్యాచ్ ల చివరి రోజుకు చేరుకున్నప్పటికీ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ లో స్థానం పొందే నాలుగు జట్లు ఖరారు కాలేదు. అయితే ముందుగా అంచనా వేసిన విధంగా ముంబై అగ్ర స్థానంలో నిలువగా, హైదరాబాద్, కోల్ కతా జట్లు మరో రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం పూణే – పంజాబ్ జట్లు సండే ఎంటర్టైన్మెంట్ ను పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారు అన్న దానిపైనే హైదరాబాద్, కోల్ కతా స్థానాలు కూడా ఆధారపడి ఉంటాయి.

తొలి రెండు స్థానాలలో నిలిస్తే… ఒక మ్యాచ్ లో ఓడిపోయినా, ఫైనల్ కు చేరుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. దీంతో మొదటి రెండు స్థానాలు కీలకం అన్నది ఐపీఎల్ ప్రియులకు తెలిసిందే. ఇందులో ఒక స్థానాన్ని ముంబై కైవసం చేసుకోగా, నేడు పూణే గెలిస్తే రెండవ స్థానానికి చేరుకుంటుంది. అలా కాకుండా పంజాబ్ విజయం సాధించినట్లయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండవ స్థానంలో నిలిచి, క్వాలిఫైయర్ 1లో ముంబైతో తలపడనుంది. దీంతో పూణే – పంజాబ్ మ్యాచ్ కోసం టాప్ 3 జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ADVERTISEMENT

ఇక, వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జరుగగా, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇక టాప్ 2లో స్థానం కోసం కోల్ కతా నైట్ రైడర్స్ చేసిన ప్రయత్నాలను ముంబై ఇండియన్స్ తిప్పికొట్టి, మరో విజయాన్ని అందుకుని నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. నిజానికి ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించాల్సి ఉండగా, బ్యాట్స్ మెన్లు అనవసరపు షాట్లను ఆడి, మ్యాచ్ ను ముంబైకు సమర్పించారు.

ADVERTISEMENT
Latest Stories