యూత్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించే మారుతీ, ఇటీవల కాలంలో అలాంటి కధలను తానూ తెరకెక్కించకుండా కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మారుతీ కధ మరియు స్క్రీన్ ప్లేతో “రోజులు మారాయి” సినిమా రూపుదిద్దుకుంది. మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా భాగస్వామి అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఆడియో విడుదల సందర్భంగా విడుదల చేసారు.
ట్రైలర్ ఫస్ట్ షాట్ లో చూపించిన సన్నివేశం ‘లవర్స్’ సినిమాలో సీన్ గుర్తు చేయనుండగా, ట్రైలర్ చివర్లో చూపించిన క్రైమ్ అండ్ హార్రర్ సీన్లు ‘ప్రేమకధాచిత్రమ్’ మాదిరి కనపడుతున్నాయి. ఇలా ప్రతి సీన్ ఏదొక మారుతీ సినిమాను జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉన్నప్పటికీ, చిత్ర ప్రధాన తారాగణం అంతా సాధారణ నటీనటులు కావడంతో పెద్దగా అంచనాలకు ఆస్కారం లేకపోవడం అత్యంత కీలక అంశం. జేబి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉండగా, ‘ఐస్ క్రీం’ పాప తేజస్వి అందచందాలు హైలైట్ గా నిలుస్తున్నాయి.



