అనౌన్స్ మెంట్ తోనే అలజడి రేపుతోన్న “ఆర్ఆర్ఆర్”

watch-most-awaited-day-of-rrr-is-loadingతెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆఫ్ ది డికేడ్ “ఆర్ఆర్ఆర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు, డివివి దానయ్య నిర్మిస్తున్నారు అనే విషయం తప్ప, మిగతా విషయాలేవీ బయటకు రాలేదు.

[m9ad]

ADVERTISEMENT

బహుశా ఈ సినిమా ప్రారంభం కాబోతున్న 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్రిటిష్ కాలం నాటి కధగా జరుగుతున్న ప్రచారం ఎంత వాస్తవమో కూడా అప్పుడే తెలియనుంది. దీంతో ప్రస్తుతం అందరి చూపులు 11వ తేదీ అయిన ఆదివారం నాడు వైపుకు మళ్ళుతున్నాయి.

‘బాహుబలి 2’ వంటి అపూర్వమైన విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్ట్ కు పబ్లిసిటీ లభించనుంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ ను ఈ సినిమా కోసం నిర్మాత డివివి దానయ్య వ్యయం చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories