ఆర్ఆర్ఆర్ షూటింగ్ లోకి ఎంటరైన బాలీవుడ్ నటుడు?

Ajay Devgan Preferred Rajamouli over Shankarబాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో నేటి నుండి పాల్గొననున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ షూట్ లోకి ఎంటరైన తొలి బాలీవుడ్ నటుడు ఈయనే. తొందర్లో నటి అలియా భట్ కూడా ఎంటర్ అవుతుందని సమాచారం.

ఇది ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో జులై 30న విడుదల అవుతుందని తెలిపిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ కు వాయిదా పడినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కు వాయిదా పడటం అనేది జరిగితే…. గాంధీ జయంతి సందర్భంగా కానీ, దసరా సందర్భంగా కానీ విడుదల అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వాయిదా పై ఇప్పటివరకూ ఆర్ఆర్ఆర్ బృందం క్లారిటీ ఇవ్వకపోయినా రాజమౌళి సినిమా వాయిదా పడటం అనేది సాధారణమే కావడంతో అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది.

ADVERTISEMENT
Latest Stories