ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ పడిందట

Rajamouli-S.S-RRRటాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ గ్యాప్ లోనే రాజమౌళి ఏదో పర్సనల్ పని మీద అమెరికా వెళ్లారట. వచ్చిన వెంటనే షూటింగ్ మొదలు అవుతుందని తెలిపింది చిత్రబృందం.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 122వ‌ జయంతి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో చెర్రీ అల్లూరి పాత్ర‌నే పోషిస్తున్నాడు కాబ‌ట్టి అల్లూరి గెటప్లో చరణ్ ఫస్ట్ లుక్‌ని రాజ‌మౌళి విడుద‌ల చేస్తాడా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూసారు. అయితే అటువంటిది ఏమీ లేదని సమాచారం. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది.

ADVERTISEMENT

ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories