అందరికీ డిసెంబర్ 20 కావాలి… కానీ ఈ రష్ వల్ల నష్టమా?

Prati Roju Pandage Enters Dubbing Mode While Balayya in Action2019 చివరికి వచ్చేసింది. ఇప్పుడు అందరి దృష్టి క్రిస్మస్ వేడుకగా వచ్చే సినిమాల మీదే. డిసెంబర్ 20 రిలీజ్ కు ఉన్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే తెలుగు నుండి నందమూరి బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా ఇదే తేదీపై కన్నేశాయి.

కార్తీ నటించిన తంబీ చిత్రం తెలుగులో దొంగగా రాబోతుంది. కార్తీ ఇటీవలే ఖైదీ వంటి పెద్ద హిట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ట్రేడ్ కు బానే ఆసక్తి ఉంది. ఇది ఇలా ఉండగా సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం తెలుగు వెర్షన్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT

సహజంగా సల్మాన్ ఖాన్ సినిమాలకు ఉండే హైప్ ఈ సినిమాకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా హాలీవుడ్ నుండి కూడా ఒక పెద్ద సినిమా అదే రోజున విడుదల కావడానికి బయలుదేరింది. స్టార్ వార్స్ – ది రైస్ అఫ్ స్కైవాకర్ ఆ రోజు విడుదల కాబోతుంది. స్టార్ వార్స్ సిరీస్ కు మంచి హైపే ఉండటంతో ఈ సినిమాకు కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా డిసెంబర్ 25న సురేష్ బాబు … వెంకటేష్ నాగచైతన్యల వెంకీ మామ చిత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ సినిమా రాకపోతే రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనితో ఈ క్రిస్మస్ కు బాక్స్ ఆఫీసు వద్ద కోలాహలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇన్ని సినిమాల వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తినే అవకాశం కూడా ఉంది.

ADVERTISEMENT
Latest Stories