జాహ్నవి కపూర్ ఊ….అంటుందా..?

Janhvi Kapoor

ఈ మధ్యకాలంలో క్రేజీ అప్ డేట్స్ తో టాలీవూడ్ లో అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ పేరు బాగా వినపడుతుంది. దేవర మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల మూవీతో మొదటిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాహ్నవి కి తెలుగు నిర్మాతల నుంచి మరిన్ని అవకాశాలు దక్కబోతున్నాయని సమాచారం.

ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ మూవీ గేమ్ చేంజర్ మూవీ తరువాత బుచ్చిబాబుతో తెరకెక్కనున్న రాంచరణ్ మూవీ లో ఈ అమ్మడునే హీరోహిన్ గా నిర్మాతలు ఎంపిక చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు మరో ప్రెస్టేజిఎస్ మూవీ లో కూడా జాహ్నవి ఒక ప్రత్యేక గీతంలో నటించబోతున్నట్లు రూమర్స్ బయటకొచ్చాయి.

ADVERTISEMENT

లెక్కల మాస్టర్ సుకుమార్ , అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ ఫీస్ట్ ‘పుష్ప ది రైసింగ్’ మూవీ ఆల్బమ్ మొత్తం మూవీ పై అమాంతం క్రేజ్ పెంచేశాయనే చెప్పాలి. అందులో స్పెషల్ గా చెప్పాలంటే హీరోహిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ…అంటావా మామా…ఉ..ఉ..అంటావా మామా..పాట అటు మాస్ అభిమానులతో పాటుగా ఇటు క్లాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరైందనే చెప్పాలి.

సినిమా మొత్తంలో ఈ పాటకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్మాలసిందే. సమంత కూడా తన డాన్స్ లతో హావభావాలతో చూస్తున్న ప్రేక్షకులను కిక్కెక్కించింది. దీనికి సీక్వెల్గా రాబోతున్న ‘పుష్ప ది రూల్’ మూవీలో కూడా సమంత పాట మాదిరే ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందంట. అందుకుగాను పలువురు బాలీవుడ్ బ్యూటీలతో సంప్రదింపులు చేసారు చిత్ర యూనిట్.

చివరికి ఆ పాటకు గాను లెక్కల మాస్టర్ జాహ్నవిని ఫైనల్ చేసారని, ఆమె కూడా దానికి ఊ..అంటూ సమాధానం చెప్పినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. క్రెజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్పాలో బన్నీతో కలిసి జాహ్నవి కూడా ప్రేక్షకులను మెప్పించి వారి నుంచి ఊ…అనిపించుకోగలిగితే అమ్మడు…అమ్మ మాదిరే అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు చక్రం తిప్పడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories