జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘విజ్ఞప్తి’

accident to NTR at Janatha Garrage Shooting‘నాన్నకు ప్రేమతో’ ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం “జనతా గ్యారేజ్” సినిమా షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ లో జూనియర్ గాయపడ్డారని, దీంతో షూటింగ్ కు అంతరాయం వాటిల్లిందని వచ్చిన వదంతులను నమ్మవద్ధంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపారు.

ఎన్టీఆర్ కెరీర్ లో 26వ సినిమాగా తెరకెక్కుతున్న “జనతా గ్యారేజ్”కు సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా తాము మాత్రమే తెలియజేస్తామని, వదంతులను, ఫేక్ ఎకౌంటులను నమ్మవద్దని జూనియర్ అభిమానులకు సంస్థ విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందో అని ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించినట్లయ్యింది. ఆగష్టు 12వ తేదీన విడుదల పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories