పవన్ కళ్యాణ్ సినిమాపై అవన్నీ పుకార్లే!

Rumours on pawan kalyan Trivikram movie“సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” సినిమాల పరాజయాల తర్వాత నిరుత్సాహంలో ఉన్న పవర్ స్టార్ అభిమానులు, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే అత్యంత త్వరగా షూటింగ్ ముగించుకునే సినిమాగా నిలవనుంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

ADVERTISEMENT

ఈ సినిమా ధియేటర్ల హక్కుల కోసం నైజాం ఏరియాలో 32 కోట్లకు, అలాగే ఆంధ్ర ప్రాంతంలో 45 కోట్లకు, సీడెడ్ లో 16 కోట్ల వరకు డిమాండ్ ఉందని… ఇలా రకరకాలుగా ఫ్యాన్సీ రేట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మొత్తం చెప్తున్న లెక్కల ప్రకారం… పవర్ స్టార్ – త్రివిక్రమ్ ల సినిమా ‘బాహుబలి’ తర్వాత స్థానంలో నిలబెడుతోంది. అయితే నిజంగా ఇంత డిమాండ్ ఉందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే, ఇప్పటివరకు ఈ సినిమా బిజినెస్ ను నిర్మాత ఓపెన్ చేయలేదని విశ్వసనీయ సమాచారం.

పవన్ – త్రివిక్రమ్ కాంభినేషన్ కాబట్టి సహజంగానే మార్కెట్ వర్గాల్లో క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫిగర్స్ ని సృష్టిస్తున్నారు గానీ, ఇందులో వాస్తవం లేదని లభించిన కీలక సమాచారం. ఈ లెక్కల ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల పైమాటే కాగా, ఆ స్థాయిలో నిజంగా బిజినెస్ జరుగుతుందో లేదో అన్నది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాదు. ఫస్ట్ లుక్, తొలి టీజర్ విడుదలైతే గానీ, ఒక అంచనాలకు వచ్చే పరిస్థితి లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ అంత జరిగితే… అది మరో సంచలనమే!

ADVERTISEMENT
Latest Stories