సత్య నాదెళ్ళ దాచుకున్న అపూరుప కానుక!

sachin tendulkar signed bat with satya-nadella-microsoftఇండియాలో క్రికెట్ గేమ్ కున్న ఆదరణ మరో ఆటకు లేదని చెప్పడంలో సందేహం లేదు. అలాగే సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు కూడా క్రికెట్ అంటే విపరీతమైన మక్కువ. అందులోనూ సచిన్ టెండూల్కర్ అంటే మరింత అభిమానం. అలాంటి సచిన్ ఇచ్చిన ఓ కానుకను సత్య ఎంతో ఇష్టంగా దాచుకున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సచిన్ టెండూల్కర్ సంతకం చేసి ఇచ్చిన బ్యాటును అపురూపంగా దాచుకున్నానని, ఇది తనకెంతో స్పెషల్ అంటూ తన క్రికెట్ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఇక, తన కుటుంబం గురించి ప్రస్తావించిన సత్య… ‘నాన్న ఫైనాన్షియర్, మార్క్సిస్టు, లెఫ్టిస్టు. అమ్మ సంస్కృతంలో ప్రొఫెసర్. దీంతో వారి అభిప్రాయాలు ఎక్కడా కలిసేవి కావు. ఒక విధంగా అదే నాకు అనుకూలంగా మారింది. ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా ఆలోచించి, అధ్యయనం చేసి, నాకు నేనుగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకో గల సామర్ధ్యతను సమకూర్చి పెట్టింది’ అంటూ తన సక్సెస్ సీక్రెట్ ను పంచుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories