అరివీర భయంకర స్టేట్మెంట్స్ తో అభాసుపాలవ్వకండయ్యా!

Saha trailer launch promotional controversy

సినిమా అనే కలల ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి ఆశ స్టార్లుగా ఎదగడమే. దానికోసమే ఏళ్ల తరబడి కష్టం, నిద్ర లేని రాత్రులు, కనీసం భోజనం లేని మధ్యాహ్నాలు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డా సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు.

అలాంటిది ఒక సినిమాలో హీరో/హీరోయిన్ గా నటించే అవకాశం రావడం లేదా దర్శకత్వం వహించే చాన్స్ రావడం అనేది గొప్ప వరం. అలాంటప్పుడు ఒద్దికతో అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అంతేకాని లేనిపోని స్టేట్మెంట్స్ తో తమ సినిమాని, తమని నవ్వులపాలు చేయకూడదు.

ADVERTISEMENT

ప్రతి ఒక్కరూ తాము చేసిన సినిమా అద్భుతం అనే ఫీలింగ్ తోనే ఉంటారు. అలాంటప్పుడు సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలే కానీ.. ఏదో ఒకరకంగా వైరల్ అవ్వాలి అని ఆలోచించకూడదు.

ఇవాళ (ఆగస్ట్ 26) “సహ” అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ శ్వేత మాట్లాడుతూ “ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్ పేట్ జంక్షన్ లో నిల్చొని గుండు కొట్టించుకుంటా” అని స్టేట్మెంట్ ఇస్తే.. హీరో ఏకంగా నెంబర్ ఇచ్చే “నచ్చకపోయే ఫోన్ చేసి బూతులు తిట్టండి” అని చెప్పేసాడు.

గతంలో సాయిలు కంపాటి, బన్నీ వాసు, వంశీ నందిపాటి వంటివాళ్లు కూడా ఈ తరహా స్టేట్మెంట్స్ చేసినవాళ్ళే. అయితే వెంటనే తప్పు ఒప్పుకుని ఆ స్టేట్మెంట్లు వెనక్కి తీసుకున్నారు.

స్పీచుల్లో వైరాలిటీ కోసం కష్టపడే బదులు.. సినిమా కంటెంట్ ని ఎలా వైరల్ చేయాలి అనే దానిపై దృష్టి సారించి.. నటీనటులుగా, టెక్నీషినన్లుగా గౌరవాన్ని సంపాదించండి. ఆ గౌరవమే విజయాన్ని కట్టబెడుతుంది.

లేదు ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి వైరల్ అవ్వడమే ఈజీగా ఉంది అనుకుంటే మాత్రం, మీమర్స్ & మీమ్ పేజస్ కి కంటెంట్ ఇవ్వడం తప్ప మీ సినిమాకి కానీ, మీకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories