మరోసారి ‘పిల్లా నువ్వులేని జీవితం’!!

sai dharam tej movie with ravikumar chowdaryమెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ మొదటి చిత్రం ‘రేయ్‌’ అయినా కూడా ముందుగా విడుదల అయిన సినిమా మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే విషయం తెల్సిందే. మొదటి చిత్రంతోనే సాయి ధరమ్‌ తేజ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా కూడా పర్వాలేదు అన్నట్లుగా నడిచి నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. ఆ సినిమాకు రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత దర్శకుడు రవికుమార్‌ మరోసారి సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మరో సినిమాను రూపొందించే ప్లాన్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న రవికుమార్‌ చౌదరి త్వరలోనే మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌తో సినిమాను చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అందుకోసం స్టోరీ లైన్‌ కూడా సిద్దం అయ్యింది. గోపీచంద్‌ సినిమా విడుదల అయిన వెంటనే స్క్రిప్ట్‌ వర్క్‌ను ప్రారంభించనున్నాడు. మరో వైపు ఈ మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ‘తిక్క’ మరియు ‘సుప్రీమ్‌’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ నటించే అవకాశాలున్నాయి. మొత్తానికి సాయి ఫుల్‌ జోష్‌తో వరుస సినిమాల్లో నటిస్తు దూసుకు పోతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories