మెగా హీరో డేట్ బుక్ చేసుకున్నాడు సరే… కబ్జా చెయ్యకుండా ఉంటారా?

Sai Dharam Tej Solo Brathuke So Better యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సాయి తేజ్ గా చిత్రలహరి చిత్రం నుండి మారిన విషయం తెల్సిందే. వరాసగా ప్లాపులతో డబల్ హ్యాట్రిక్ కొట్టిన సాయి తేజ్, చిత్రలహరి చిత్రం ద్వారా కొంత ఊరట పొందాడు. ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో చేసిన ప్రతి రోజు పండగే రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ADVERTISEMENT

మరో వైపు తన ఇంకో సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు” ఈ రోజునే పట్టాలెక్కించాడు. ఈ రోజు అంతర్జాతీయ మగవారి దినోత్సవం సందర్భంగా సినిమా షూటింగ్ మొదలయ్యింది. మే 1 2020 న మే డే సందర్భంగా సినిమా విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు.

మే 1 ఒకటి శుక్రవారం మే డే హాలిడే, ఆ వెంటనే వీకెండ్ హాలిడేస్ కలిసి వస్తాయని ఆరోజుని టార్గెట్ చేస్తుంది చిత్రబృందం. ఈ మధ్య కాలంలో ఎంతో ముందుగా సోలో డేట్స్ కోసం బుక్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే చివరి నిముషంలో వేరే సినిమాలు అదే తారీఖున వచ్చి ఆ డేట్స్ ను కబ్జా చేస్తున్నాయి. మరి సాయి ధరమ్ తేజ్ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి.

సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రతిరోజూ పండగే చిత్రానికి కూడా థమన్ స్వరకర్త. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ పాటలు హిట్ అయినా కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. మరి ఈ రెండు చిత్రాలతోనైనా థమన్, సాయి తేజ్ జోడి హిట్ కొడుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories