ప్రాణం పెట్టింది కానీ ఫలితం దక్కలేదు!

Sai Pallavi Maari 2 Movieతన నటనతో ‘ఫిదా’ చేసి అటు మలయాళం నుంచి ఇటు తెలుగు ప్రేక్షకుల వరకూ అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవికి నిన్న నిజంగానే బ్యాడ్ డే…భారీ అంచనాలతో రిలీజ్ అయిన రెండు సినిమాలు..అదీ రెండు భాషల్లో…భారీగానే షాక్ ఇచ్చాయి.

[m9ad]

ADVERTISEMENT

ముందుగా తమిళంలో ఆమె ఆటో డ్రైవర్ గా కనిపించి మెప్పించిన ధనుష్ “మారి-2 ” బ్యాడ్ టాక్ తెచ్చుకోగా..మరో పక్క తెలుగులో శర్వాతో కలసి చేసిన “పడి-పడి-లేచే-మనసు” బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనేలా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అయితే తన వంతు వరకూ ఈ భామ మంచి నటననే ప్రదర్శించింది కానీ కథలో బలం కధనంలో కిక్ లేకపోతే ఎంత నటించినా ఉపయోగం ఏముంది. ఏది ఏమైనా..ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఒక్క సినిమా కూడా లేదు..మరి ఇతర భాషలో రెండు సినిమాలు చేస్తున్న ఆమెకు ఆ రెండు హిట్ అయితేనే మరింత మైలేజ్ వచ్చి భారీ ఆఫర్స్ వస్తాయి అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories