ఆ రెబెల్ హీరోతో సాయి పల్లవి

Sai Pallavi next with Vijay deverakondaఅర్జున్ రెడ్డి వంటి రెబెల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ నిజజీవితంలో కూడా అంతే రెబెల్ గా ఉంటున్నాడు. ఇప్పుడు అతను ఫిదాతో కుర్రకారుని ఉర్రూతలూగించిన సాయి పల్లవితో జత కట్టబోతున్నాడంట. నీది నాది ఒకే కథ వంటి చక్కని సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన వేణు ఈ సినిమాకు దర్శకుడు.

ADVERTISEMENT

1990లో తెలంగాణాలో జరిగిన ఒక ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరన సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఫిదాలో తెలంగాణ యాసతో సాయి పల్లవి అదరగొట్టింది. విజయ్ స్వయానా తెలంగాణ వాడు కావడంతో ఈ సినిమా మరింత రక్తి కట్టబోతుంది.

విజయ్ దేవరకొండ టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాక సోలో ఫేమ్ పరశురామ్ తో ఒక సినిమా, నోటా, డియర్ కామ్రేడ్ అనే మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి. టాక్సీవాలా, పరశురాం సినిమా వచ్చే రెండు నెలలో విడుదల అవ్వుతుండంగా, నోటా, డియర్ కామ్రేడ్ వచ్చే ఏడాది విడుదల అవుతాయి. సాయి పల్లవి చేతిలో పడి పడి లేచెను మనసు ఉంది.

ADVERTISEMENT
Latest Stories