చైతూతో బ్రేకప్ అయిన తర్వాత హాట్ అండ్ సిజ్లింగ్ ఐటెం సాంగ్ తో “పుష్ప”లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించి షాక్ ఇచ్చిన సమంత, లేటెస్ట్ గా ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గోవాలో తన సన్నిహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఎంజాయ్ చేస్తోంది సమంత.
ఈ పిక్ లో సమంత బాహ్యా సౌందర్యం పక్కన పెడితే, ఎంతో రిలీఫ్ గా కనపడుతుండడం ‘కుందనపు బొమ్మ’ అభిమానులకు ఉపశమనం కలిగించే విషయం. బ్రేకప్ నుండి సమంత బయట పడలేకపోతోందని ఇటీవల వచ్చిన వార్తలతో కలత చెందిన ‘జెస్సీ’ ఫ్యాన్స్ ను ఈ పిక్ ఫిదా చేస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన “శకుంతలాం” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, బ్రేకప్ తర్వాత కొత్తగా వెబ్ సిరీస్ లను మరియు హాలీవుడ్ సినిమాను ఒప్పుకున్న విషయం తెలిసిందే. సమంత స్వాతంత్య్రానికి నిదర్శనంగా ఈ బికినీ పిక్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు.



