101 శాతం సక్సెస్‌ గ్యారెంటీ!

sampath nandi Ravi-teja-bengal-tigerమాస్‌ మహారాజ రవితేజ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు భీమ్స్‌ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాతో తనకు బ్రేక్‌ రావడం ఖాయం అని భావిస్తున్న భీమ్స్‌, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా భీమ్స్‌ మాట్లాడుతూ సక్సెస్‌పై తనకు ఉన్న నమ్మకంను చెప్పుకొచ్చాడు.

భీమ్స్‌ మాట్లాడుతూ… ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం 100కు 101 శాతం సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం చిత్ర యూనిట్‌ సభ్యులందరికి ఉందని, దర్శకుడు సంపత్‌ నంది ఈ సినిమాలో మాస్‌ రాజా రవితేజను చూపించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చుతుందని, ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ ఈ సినిమాలో రవితేజ పోషించిన పాత్రకు ఫిదా అవుతారు అంటూ సినిమాపై అంచనాలు పెంచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు తమన్నా మరియు రాశి ఖన్నాలు నటించారు. వీరిద్దరి అందచందాలు సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు. భారీ అంచనలున్న ఈ సినిమా సక్సెస్‌ దర్శకుడు సంపత్‌ నందికి మరియు హీరో రవితేజకు చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories