సంపూర్ణేష్ బాబు సినిమా సృష్టించబోతున్న రికార్డ్!

sampoornesh-babu-movie Kobbari Matta Dubbing into Multi Languagesనైజీరియా భాషలో విడుదల అవుతున్న తొలి తెలుగు చిత్రం తన ‘కొబ్బరిమట్ట’ అని ప్రముఖ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, కన్నడ ప్రాంతీయ భాషల్లో విడుదల చేయనున్నామన్నారు. అంతేకాకుండా, ‘కొబ్బరి మట్ట’ ను నైజీరియా భాషలో కూడా విడుదల చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయిందని, ఈ చిత్రంలో నటించినందుకు తన మనసు ఆనందంతో పులకిస్తోందని, జీవితానికిది చాలని అన్నారు. ‘కొబ్బరి మట్ట’ ను తమిళ, కన్నడ, నైజీరియా భాషల్లోకి అనువదించడం వలన ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ, సెన్సేషన్ కావడం మాత్రం ఖాయం. ఇది, నా గుండె గుద్ది చెబుతున్నమాట’ అని సంపూ పేర్కొన్నాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories