ఏం టైం ఫిక్స్ చేసావు గురూ!

Sampoornesh Babu - Paparayudu Teaser Launch Latest Newsచిన్న సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వడం ఓ ఆర్ట్. దీనిని అందరూ సక్సెస్ ఫుల్ గా అవలంభించలేరు. కానీ, ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మాత్రం తన సినిమాలకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ ఇస్తుంటారు. తాజాగా కూడా అలాంటి ముహూర్తాన్నే ఖరారు చేసారు. గత కొన్ని నెలలుగా ప్రిన్స్ అభిమానులు వేచిచూస్తున్న ముహూర్తం ప్రకటన రాగానే, సంపూర్ణేష్ బాబు నుండి కూడా మరో ప్రకటన వచ్చింది.

మురుగదాస్ – మహేష్ ల కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఫస్ట్ లుక్’ బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన కొద్దిసేపటికే, సంపూ తన తాజా సినిమా ‘కొబ్బరిమట్ట’లోని ‘పాపారాయుడు’ పాటను అదే ముహూర్తానికి విడుదల చేస్తున్నట్లుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో మహేష్ తో పాటు సంపూ కూడా వస్తున్నాడంటూ ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది.

ADVERTISEMENT

ముందుగా ఫిక్స్ చేసుకున్న సమయమో లేక ఉద్దేశ పూర్వకంగా ఫిక్స్ చేసిందో తెలియదు గానీ, ఒకే ముహూర్తానికి మహేష్, సంపూ సినిమాల హంగామా మొదలు కావడం విశేషం. అయితే అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదని, పోస్టర్ డిజైనింగ్ తో సహా పోస్టర్ ను విడుదల చేయడంతో ముందుగా అనుకున్న సమయమే అని సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి సంపూ ‘టైమింగ్’ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories