Sandeep Reddy Vanga Spirit Movie Music

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన సందీప్, యానిమల్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారనే చెప్పాలి. అయితే ఆయన సినిమాలు కథ , కథనం పరంగా అందరిని ఆకట్టుకుంటున్నప్పటికీ బోల్డ్ కంటెంట్ శ్రుతి మించడంతో వివాదాలు వంగా సినిమాలను వెంటాడుతాయి.

అయితే సినిమా పరంగా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని వివాదాలు వెంటాడినా, సందీప్ మూవీ లో మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేస్తూ అందరిని కట్టిపడేస్తుందనే చెప్పాలి. ముందుగా వచ్చిన అర్జున్ రెడ్డి కూడా సినిమా పరంగా ఎన్నో వివాదాలను తెచ్చిపెట్టినప్పటికీ సాంగ్స్ మాత్రం ఇప్పటికి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్స్ గా యూత్ మొత్తాన్ని కట్టపడేస్తాయి.

Also Read – కేసీఆర్‌ నిశ్శబ్దం – కేటీఆర్‌ సెలవు!

అలాగే యానిమల్ మూవీ లో అన్ని పాటలు వాటికవే ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నప్పటికీ ‘నాన్న’ సాంగ్ మాత్రం చాలామంది ఆల్ టైంఫేవరేట్ సాంగ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు పాటలతో పాటుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అతిపెద్ద బలంగా మారింది.

థియేటర్లలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే కొన్ని బీజీఎమ్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయనే చెప్పాలి. ఇక ఇప్పుడు 2026 లో ప్రభాస్ తో రాబోతున్న స్పిరిట్ మూవీ పై కూడా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

Also Read – కూటమి ప్రభుత్వం: పాత సినిమా రీ-రిలీజ్?

పోలీస్ క్యారెక్టర్లో ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారు అనే ఉత్కంఠ అటు ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా ఇటు వంగా అభిమానులలో సైతం కనపడుతుంది. అయితే సందీప్ వంగా తన సినిమాలో హీరోను ప్రేక్షకులకు చూపించే విధానంగా ఎప్పుడు కొత్తదనంతో కూడుకొని ఉంటుంది. దీనితో ప్రభాస్ లుక్ మీద అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.

అయితే ప్రభాస్ రాజా సాబ్ తరువాత హనురాఘవ పూడి సినిమా, సాలార్ -2 రెండు ప్రాజెక్టులకు గుమ్మడికాయి కొట్టి ఆ తరువాత స్పిరిట్ తో వంగా మూవీలో జాయిన్ అవుతారు. అయితే ఈ లోపు ఈ మూవీ కి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టుగా సందీప్ వంగా తన సోషల్ మీడియాలో దానికి సంబందించిన ఫోటోలను పోస్ట్ చేసారు.

Also Read – ఎప్పుడు దొరికిపోయినా ఎదురుదాడే వైసీపీ ఫార్ములా?


సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ ని ట్యూన్ చేస్తూ వంగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా పిక్స్ కనపడుతున్నాయి. దీనితో సందీప్ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దమయ్యారా.? అంటూ నెట్టింట స్పిరిట్ మూవీ గురించి చర్చ మొదలయ్యింది.