సెక్స్ రాకెట్ లో నటి సంగీత అరెస్ట్!

sangeetha-balan-arrested-in-sex-scandalసెక్స్‌ రాకెట్‌ నడుపుతూ చెన్నయ్‌ పనయూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో తమిళ సీనియర్‌ నటి సంగీత బాలన్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ రిసార్టులోకి సంగీత బాలన్‌ పలువురు అమ్మాయిలను తీసుకొచ్చిందంటూ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా, వారంతా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కేసులో సురేష్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

ADVERTISEMENT

అక్కడ ఉన్న అమ్మాయిలంతా పలు రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ చెన్నయ్‌లోని పునరావాస కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు సంగీత, సురేష్‌లను ఎగ్మోర్‌లోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. సదరు నటి 1996లో వచ్చిన తమిళ సినిమా ‘కరుప్పు రోజా’ ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు.’వాణి రాణి’ టీవీ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా సంగీత సుపరిచితమే.

ADVERTISEMENT
Latest Stories