బన్నీ వ్యవహారమేంటో తేడాగానే ఉంది?

Sankranthi 2020, Allu Arjun Ala Vaikuntapuramloకొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరోలు అంతా వచ్చారు. అయితే బన్నీ మాత్రం ఎందుకో రాలేదు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటివరకూ దానిపై బన్నీ పెదవి విప్పలేదు. ఈలోగా మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ నెల 29న వైజాగ్ లో జరగనున్న గోపీచంద్ చాణక్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ అంట.

చాణక్య దసరా సీజన్ లో విడుదల అవుతుంది. గోపీచంద్ సినిమా చిరంజీవి సైరాకి పోటీ కాకపోయినా రెండూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ ఆ సినిమా వేడుకకు వెళ్లడం అంటే ధిక్కారంగానే మెగా ఫ్యాన్స్ లోని ఒక వర్గం భావిస్తుంది. ఇప్పటివరకూ సీరియస్ గా తీసుకొని వారు కూడా బన్నీ వ్యవహారమేంటో తేడాగానే ఉంది అంటున్నారు.

ADVERTISEMENT

సైరా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. మరోవైపు చాణక్య మూడు రోజులు ఆలస్యంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా కాలంగా గోపీచంద్ కు సరైన హిట్ లేదు దానితో ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నారు. దసరా అడ్వాంటేజ్ కోసం చిరంజీవితో పోటీకి కూడా సై అన్నాడు గోపీచంద్.

ఫ్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో మెహ‌రీన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 2014 లో లౌక్యం తరువాత గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు గోపీచంద్. ఇప్పుడు ఏకంగా ఆయన మార్కెట్ జీరో అయ్యే పరిస్థితి ఉంది. ఈ సినిమాతోనైనా ఆయన హిట్ సాధిస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories