ట్రైలర్ టాక్ – ‘డమరుకం 2’లా ఉంది!

Sarabha Movie Theatrical trailer‘కింగ్’ నాగార్జున హీరోగా నటించిన ‘డమరుకం’ సినిమా కాన్సెప్ట్ గుర్తుంది కదా! ఒకవేళ గుర్తుకు రాకపోతే… దానిని మరోసారి గుర్తుకు తెచ్చే విధంగా “శరభ” ట్రైలర్ నిలుస్తోంది. హీరోయిన్ ను రక్షించడానికి దుష్ట శక్తులతో హీరో పోరాడడం, అందుకు దైవం సహకరించడం వంటి సన్నివేశాలతో ‘శరభ’ స్టోరీ అయితే ఆసక్తికరంగానే ఉంది.

[m9ad]

ADVERTISEMENT

కానీ కాస్టింగ్ ప్రధాన మైనస్ అన్న విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. చిత్ర కాస్టింగ్ కు తోడు గ్రాఫిక్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పైన అస్సలు కనిపించడం లేదు. నితిన్ ‘చిన్నదానా నీ కోసం’ సరసన నటించిన మిస్తీ చక్రబోర్తి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జయసుధ, నెపోలియన్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా విడుదల చేసి అప్పట్లో హంగామా సృష్టించారు. నరసింహరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీతం అందిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ద్వారా ఆకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories