“సరైనోడు” టీజర్ లో “స్పెషాలిటీస్” ఉన్నాయ్!

alluarjun- sarainodu teaser talkకొద్దిసేపటి క్రితం విడుదలైన అల్లు అర్జున్ “సరైనోడు” సినిమా టీజర్ మెగా అభిమానులతో పాటు సినీ మన్ననల మెప్పు పొందుతోంది. ఈ టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బహుశా అవి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు దోహదపడుతుందని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే… ఈ టీజర్ లో ప్రత్యేకతల గురించి నెటిజన్లలో చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. టీజర్ 8వ సెకన్ లో అల్లు అర్జున్ క్లబ్ లాంటి ప్రదేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, వెనుక హీరో శ్రీకాంత్ దర్శనమిచ్చారు. అంటే శ్రీకాంత్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారని చిత్రబృందం చెప్పకనే చెప్పింది. శ్రీకాంత్ తో పాటు విలన్ గా ‘మలుపు’ సినిమా హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. టీజర్ లో ఆదికి సంబంధించి కళ్ళు మాత్రమే చూపించారు.

ADVERTISEMENT

ఇవి పాజిటివ్ యాంగిల్స్ తో పాటు మరో నెగిటివ్ కూడా ప్రచారంలో ఉంది. ఈ టీజర్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందరినీ పడేసింది. అయితే దీని అసలు మాత్రం హాలీవుడ్ సినిమా ‘పసిఫిక్ రిమ్’లో ఉందట. దీంతో మరోసారి కాపీ కొట్టుడు తెరపైకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి అంశాలన్నీ ఎక్కువగా మెగా ఫ్యాన్స్ వెలుగులోకి తెస్తుంటారు. కానీ, ఈ సారి వారి అభిమాన నటుడు సినిమాపైనే ‘కాపీ’ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఎటూ పాలుపోలేని స్థితిలో పడ్డారు.

ADVERTISEMENT
Latest Stories