బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “సరైనోడు” సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది. స్టైలిష్ స్టార్ స్టైల్ గా నిల్చున్న ఈ పోస్టర్ డిజైన్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో దుమ్ము దులుపుతూ దర్శనమిచ్చిన ఈ పోస్టర్ ద్వారా మరో తీపి కబురును కూడా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు అందించింది.
ఈ నెల 18వ తేదీన “సరైనోడు” సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారనే సమాచారంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పోస్టర్లు అల్లు అర్జున్ ను ఓ మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. బహుశా 18న విడుదల కానున్న టీజర్ దీనిపై స్పష్టత ఇస్తుందేమో చూడాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT





