సర్కార్ వారి ఫస్ట్ సింగిల్ – సెన్సేషనల్ 1!

sarkaaru vari paata first single updateసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన “సర్కార్ వారి పాట” మొదటి సాంగ్ అప్ డేట్ గురించి అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్న తెలిసిందే. జనవరి నుండి ఈ సినిమా అప్ డేట్స్ ఇస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చెప్పింది గానీ డేట్ ను మాత్రం ప్రకటించలేదు.

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వస్తుందని ముందుగా అంతా భావించారు గానీ, ఇటీవల రమేష్ బాబు మరణంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ఓ అప్ డేట్ ను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ADVERTISEMENT

‘సర్కార్ వారి పాట’ ఫస్ట్ సింగిల్ రెడీ టీం అంతా వర్క్ చేస్తోందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని, అయితే ఈ ఫస్ట్ సింగిల్ ‘సెన్సేషనల్ 1’గా ఉంటుందని అభిమానులకు పిలుపునిచ్చాడు థమన్. అంటే సంక్రాంతికి ఫస్ట్ సింగిల్ రాదని పరోక్షంగా థమన్ వెల్లడించారు.

జనవరిలో తొలి పాట రిలీజ్ అని దాదాపుగా రెండు, మూడు నెలల నుండి చిత్ర యూనిట్ ప్రకటిస్తోంది గానీ, ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ ను సిద్ధం చేయకపోవడం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ‘పుష్ప’ ప్రమోషన్ విషయంలో మైత్రీపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

తాజా పరిణామాలు గమనిస్తుంటే ‘సర్కార్ వారి పాట’ విషయంలోనూ మైత్రీ అదే బాటలో పయనించేలా కనపడుతోంది. బహుశా జనవరి 26వ తేదీన ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావచ్చన్నది లేటెస్ట్ టాక్. లేటుగా వచ్చినా థమన్ చెప్పినట్లుగా ‘సెన్సేషనల్ 1’గా ఉంటే చాలు అని అనుకోవడం ఫ్యాన్స్ వంతు!

ADVERTISEMENT
Latest Stories