మావయ్యా! ఆంధ్రా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి?
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలిరా అల్లుడూ!
మరి ఎందుకు ఏర్పాటు చేయలేదు?
నీకు తెలీదూ… ఆ చంద్రబాబు అడ్డుకున్నాడురా!
మరయితే ఆంధ్రా అభివృద్ధికి మరే ఉపాయం లేదా మావయ్యా?
లేకేం! విశాఖ రాజధాని చేస్తే అవుతుందని చెప్పాం కదా?
మరెందుకు చేయలేదు?
దానికీ ఆ చంద్రబాబు నాయుడే అడ్డు పడ్డాడు రా! ముందు నేను ఓ 500 కోట్లు పెట్టి రుషికొండ మీద చిన్న ఇల్లు కట్టుకున్నాక విశాఖని రాజధాని చేసేద్దామనుకున్నా… కానీ ఈ చంద్రబాబు నాయుడున్నాడే… దానినే చూపించి ప్రజలను భయపెట్టేసి నన్ను దించేశాడు!
అయ్యో పాపం! నీకు నా సానుభూతి మావయ్యా?
ప్రతీవాడు సానుభూతి చూపేవాడే కానీ ఓట్లేసే వాళ్ళు ఎందరు?అయినా ఈ జనాలకు చేసిన మేలు గుర్తు ఉండదు. అందుకే కృతజ్ఞత చూపరు.
అదేంటి మావయ్యా అలా అంటావు? నువ్వేమైనా వాళ్లకి నీ ఆస్తి పంచిచ్చావా?అప్పులు చేసి పంచిపెట్టిన సొమ్మే కదా? నీకు కృతజ్ఞత చూపమంటావు. కానీ ఆ ఋణం వాళ్ళనే తీర్చుకోమంటావు!
అదేరా రాజకీయం అంటే!
మరైతే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి మావయ్యా?
నాకూ తెలీడం లేదురా!
మావయ్య ఈ విషయం విన్నావా? ఆవిడెవరో మంత్రి సవిత అట! చిత్తూరు, శ్రీ సత్యసాయి, గుంటూరు, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో 8 టెక్స్‌టైల్ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయట!
చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో రూ.120 కోట్లతో జీనియస్ ఫిల్టర్స్, శ్రీసత్యసాయి జిల్లా, హిందూపురంలో రూ.20 కోట్ల పెట్టుబడితో అరవింద్ అపారెల్ పార్క్, గుంటూరులో రూ.35 కోట్ల పెట్టుబడితో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు అవుతున్నాయట!
అనకాపల్లి జిల్లాలో రూ.10 కోట్ల పెట్టుబడితో బీక్యూ టెక్స్‌టైల్, విశాఖలో రూ.4,000 కోట్లతో ఫిన్ ల్యాండ్ దేశానికి చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ కంపెనీ, రూ.105.38 కోట్ల పెట్టుబడితో ఎంవీఆర్ టెక్స్‌టైల్ కంపెనీ ఏర్పాటు కాబోతున్నాయట! వాటిలో మొత్తం 6,460 మందికి ఉద్యోగాలు లభిస్తాయట!
ఇలా అయితే మన పని అయిపోయినట్లే! అందరికీ చేతి నిండా పని, చేతిలో డబ్బు ఉంటే ఇక మన మాట ఎవరు వింటారు?
ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవడమే కానీ ఇంత చిన్న విషయం ఈ పెద్దాయనకు ఎందుకు అర్ధం కాదో? అడిగితే నేనే చెప్పేవాడిని కదా?సరేలే ఎలాగూ మళ్ళీ మనమే వస్తాం కదా? అప్పుడు అన్నిటినీ మూయించేద్దాం?
మళ్ళీ వస్తామనే నీకు నమ్మకం ఉందా మావయ్య?
లేకపోయినా ఉన్నట్లే మాట్లాడుతుండాలిరా!ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలుసు. చంచల్ జైలుకి వెళ్ళివచ్చినడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తారని ఎవరైనా కలగన్నారా?కానీ చేశారుగా! అలాగే ఎప్పుడో ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనమే!
అంటే మనం హోప్‌లెస్ కాదు… హోప్‌ఫుల్ అన్నమాట!
అంతేగా.. అంతేగా!






