పుట్టినరోజు నాడు ఏం ఫోటో పెట్టిందో చూడండి!

Seerat Kapoor 24th birthdayగడిచిన ఓ వారం, పది రోజులుగా ప్రతి రోజు ఓ హాట్ పిక్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ‘రాజు గారి గది 2’ హీరోయిన్ శీరత్ కపూర్, హీరోయిన్లు ఎవరూ చేయని పని చేసేసింది. సహజంగా సినీ ముద్దుగుమ్మలు తన వయసును బయటకు వెల్లడించరు. కానీ శీరత్ మాత్రం అందుకు విభిన్నంగా తానూ 24వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానని చెప్తూ… ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

మామూలు రోజుల్లో హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేసిన ఈ బ్యూటీ, పుట్టినరోజు నాడు మాత్రం కాస్త వినూత్నంగా నిండైన డ్రెస్ తో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆరంజ్ కలర్ గౌన్ లో చైర్ లో నిద్రిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోతో 24లోకి ప్రవేశించానని స్పష్టం చేసింది. అంటే సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగించడానికి తనకు ఇంకా చాలా వయసు ఉందనే విషయాన్ని పరోక్షంగా శీరత్ కపూర్ చెప్పకనే చెప్పిందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories