2007 లో నూతన నటీనటులతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ మూవీ త్వరలో రీరిలీజ్ కాబోతుంది అంటూ మూవీ యూనిట్ ఒక ప్రకటన చేసింది. ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ల సందడి జోరురందుకోవడంతో గతంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలను అడ్వాన్స్ టెక్నాలెజీ తో మరో సారి థియేటర్ల ముందుకి తీసుకువస్తున్నారు మూవీ మేకర్స్.
ప్రేక్షకులు కూడా ఈ రీరిలీజ్ సంస్కృతికి మద్దతుగా తమకు నచ్చిన సినిమాలను మరోసారి వెండి తెరమీద చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో మూవీ మేకర్స్ కూడా ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. హ్యాపీ డేస్ అంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలను అద్దం పట్టేలా తెరకెక్కించిన ఈ మూవీ అటు యూత్ తో పాటు ఇటు ఫామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.
అలాగే కొత్త నటులతో క్లాసికల్ సినిమాలు తీయడంలో తనదైన స్టైల్ ను చూపించే శేఖర్ కమ్ముల ఖాతాలో మరో క్లాసికల్ హిట్ గా నిలిచింది హ్యాపీ డేస్. ఈ మూవీలో కీలక పాత్రలు పోషించిన వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా వంటి నటీనటులకు తమ సినీ కెరియర్ కు ఈ హ్యాపీ డేస్…, నిజంగా హ్యాపీ డేస్ ను తెచ్చిందనే చెప్పాలి.
బీటెక్ విద్యార్థుల జీవితంలో మొదలయ్యే కొత్త పరిచయాలు స్నేహం…ప్రేమ..వంటి సెన్సిటివ్ సబ్జెక్టు తో వచ్చిన హ్యాపీ డేస్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. హ్యాపీ డేస్…హ్యాపీ డేస్ అంటూ మూవీ ఎండింగ్ లో వచ్చే సాంగ్ నిజంగా మూవీ చూస్తున్న ప్రతి ఒకరికి వారి విద్యార్థి జీవితాన్ని గుర్తు చేస్తుంది. మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్ ఈ మూవీ కి మంచి ఎసెట్ అనే చెప్పాలి. మరి ఈ హ్యాపీ డేస్ మూవీ ని మరో సారి థియేటర్లలో చూడడానికి ఏప్రిల్ 12 వరకు ఆగాలి.




