టాప్ హీరో ‘బాత్రూం’ పాట్లు!

Shah rukh khan -Lundi Danceటాప్ హీరోలు నటించే సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైన సందర్భాలలో… సినిమాలు దారుణ పరాజయం పాలు కావడం షరామామూలుగా జరిగే విషయం. మరి అలాంటి టైంలో సదరు హీరోలు ఎలా ప్రవర్తిస్తారు? అంటే… అందరి మాటేమో గానీ, ‘బాలీవుడ్ బాద్ షా’ షారుక్ ఖాన్ మాత్రం… ‘బాత్రూంకు వెళ్లి, గడియ పెట్టుకుని పెద్దగా ఏడ్చేవాడిని’ చెప్పుకొచ్చాడు.

60వ శాన్‌ ఫ్రాన్సిస్కో చలన చిత్రోత్సవానికి హాజరైన షారూఖ్, అమెరికా దర్శకుడు బ్రెట్‌ రత్నర్‌ తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో ఎదురయ్యే జయాపజయాలను ఎలా ఎదుర్కొంటారని ఒక అభిమాని షారూఖ్ ఖాన్ ను ప్రశ్నించగా… సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు చాలా సాధారణమని, తన సినిమా బాగా ఆడనప్పుడు బాత్రూమ్‌ కి వెళ్లి గట్టిగా ఏడుస్తానని వివరించాడు.

ADVERTISEMENT

అయితే అలా చేయడం మంచిదేనని, అప్పుడు తనలో ఉన్న బాధంతా తీరిపోయేదని షారూఖ్ పేర్కొన్నాడు. వంద శాతం కష్టపడి పనిచేస్తే జయాపజయాలు పెద్దగా ప్రభావం చూపవని, నిజాయితీ, కష్టపడేతత్వం మంచి దారి చూపిస్తాయని షారూఖ్ సమాధానమిచ్చాడు. అనంతరం బ్రెట్‌ రత్నర్‌ కు లుంగి డాన్స్ స్టెప్పులు నేర్పించగా, సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అభిమానులను అలరిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories