అల్లుడు గారి తిప్పలకు ఇదో శాంపిల్!

Shailaja-Reddy-Alludu-Choode-Song-Promoమరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానున్న “శైలజారెడ్డి అల్లుడు”కు సంబంధించిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘శైలజారెడ్డి అల్లుడు చూడే’ అంటూ తెలంగాణా మాండలికంలో ఆలపించిన మంగలి సత్యవతి వాయిస్ తో ఇప్పటికే ఈ పాట ఎంతో పాపులర్ కాగా, తాజాగా ఈ వీడియోలో అల్లుడు పడే తిప్పలను శాంపిల్ గా విడుదల చేసారు.

అత్తకు – కూతురుకు నడుమ నలిగిపోయే అల్లుడుగా చైతూ సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాగ్ కెరీర్ లో ‘అల్లరి అల్లుడు’ మాదిరి, చైతూ కెరీర్ లో ‘శైలజారెడ్డి అల్లుడు’ నిలిచిపోతుందని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. నాని, శర్వానంద్ కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ, ఈ అక్కినేని వారసుడి కెరీర్ కూడా మలుపు తిప్పుతారని ఆశిద్దాం.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories