‘సర్ధార్’ సెట్ లో నాడు జరిగింది ఇదే!

Shakalaka-Shankar‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కానిస్టేబుల్ గా కమెడియన్ రోల్ చేసిన షకలక శంకర్, సెట్ లో అనుచితంగా ప్రవర్తించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై శంకర్ స్పందిస్తూ వివరణ ఇచ్చుకున్నాడు. బుల్లితెరపై ప్రదర్శితమైన ఓ షోలో తెలుపుతూ…

“నేను ఆ సినిమా ఒప్పుకున్నదే పవన్ కళ్యాణ్ ను దగ్గర నుంచి చూడటానికి. ఏ సీన్ చెబుతున్నారని గానీ… ఎలా చేయాలని గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని. అయినా తనివి తీరేది కాదు, ఆ సినిమాకి తీసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు.

ADVERTISEMENT

దీంతో పవన్ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుండేది. అది తట్టుకోలేక కో డైరెక్టర్ పై అరిచాను. ఆ విషయం తెలిసి పవన్ నన్ను పిలిపించారు. ‘ఏరా అప్పుడే డైరెక్టర్ ను, కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు, నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు, పని చేసుకుని పో… అర్థమైందా… పో’ అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే” అంటూ తెలిపాడు.

ADVERTISEMENT
Latest Stories