షాలినీ…మరీ అంత స్పీడా?

Shalini Pandey enjoying with handfull offersదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు కదా పెద్దవాళ్ళు..బహుశా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు అనుకుంటా మన టాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పటికీ వదలలేక పోతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే హీరోయిన్స్ కి క్రేజ్ ఉన్నప్పుడేగా నాలుగు రాళ్లు వెనకేసుకునేది..అందుకేనేమో మన టాలీవుడ్ భామ..అర్జున్ రెడ్డి స్వీట్ హార్ట్ షాలినీ పాండే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒక పక్క బడా భామలు రకుల్..లాంటి వాళ్ళు పాపం సినిమాలు పెద్దగా లేక ఖాళీగా కనిపిస్తూ ఉంటే..షాలినీ మాత్రం 2017 అర్జున్ రెడ్డి తర్వాత వరుసగా రెండు హిందీ సినిమాల్లో నటించింది..

ఇక తెలుగులో అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ‘118 ‘ లో నటిస్తుంది…

ఇక తమిళ్ విషయమే తీసుకుంటే 100 % కాదల్…గొరిల్లా తర్వాత అగ్ని సిరుగుగుల్ అంటూ విజయ్ ఆంటోనీ సినిమాలో కనిపించనుంది…అయితే ఈ సినిమా తెలుగులో జ్వాలగా రానుంది.

మొత్తంగా చూసుకుంటే షాలినీ పాండే..వరుస ఆఫర్స్ తో మంచి బిజీగానే కనిపిస్తుంది…మరి ఇదే ఊపులో ఆమె ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు..!

ADVERTISEMENT
Latest Stories