ఇప్పటికే వీక్షకుల ఆదరణను చూరగొన్న “శమంతకమణి” సినిమా ట్రైలర్ టాలీవుడ్ టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబును కూడా ఆకట్టుకుంది. “ఇటీవల కాలంలో తాను చూసిన స్టైలిష్ ట్రైలర్స్ లో ఇది ఒకటని, చిత్ర యూనిట్ కు మరియు సుధీర్ బాబుకు అభినందనలు” తెలుపుతూ ట్వీట్ చేసారు ప్రిన్స్. సాధారణంగా మహేష్ ఖాతా నుండి ట్వీట్స్ రావడం బహు అరుదు కావడంతో, “శమంతకమణి” సినిమాకు ఫుల్ పబ్లిసిటీ దొరికినట్లే.
శుక్రవారం నాడు విడుదలైన ఈ ట్రైలర్ కు ప్రేక్షకులు నీరాజనం పలికారు. నలుగురు యువ హీరోలు సుధీర్ బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆదిలు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను, కన్ ఫ్యూజన్ కు తావు లేకుండా అదిరిపోయే స్థాయిలో కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. యూ ట్యూబ్ లో హాఫ్ మిలియన్ క్లిక్స్ దాటిపోయిన ఈ ట్రైలర్ కు మహేష్ ట్వీట్ మిలియన్ మార్క్ ను చేరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
ADVERTISEMENT
ADVERTISEMENT



