తెలుగుతో పాటు పలు భాషల్లో ఎన్నో అద్బుతమైన పాటలు పాడి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గాయకుడు శంకర్ మహదేవన్. తెలుగులో ఈయన పాడిన పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. టాలీవుడ్‌లో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శంకర్ మహదేవన్‌కు ఉన్నట్లుండి గుండెపోటు వచ్చిందట. దాంతో వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేయించి చికిత్స చేయిస్తున్నారు.
శంకర్ మహదేవన్ కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పని ఒత్తిడి వల్ల గుండె పోటు వచ్చి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. వారం నుండి పది రోజులు శంకర్ మహదేవన్‌ను రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. శంకర్ మహదేవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని డాక్టర్లు చెప్పడంతో ఫ్యాన్స్ మరియు ఆయన సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.
ADVERTISEMENT





