స్టార్ హీరో సరసన జాక్ పాట్ కొట్టింది!

Shanvi srivastava next movie with upendra‘లవ్లీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాన్వి తెలుగులో ‘అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయా’ వంటి సినిమాలు చేసింది గానీ, పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో కన్నడలో “చంద్రలేఖ” (ప్రేమకధాచిత్రమ్ రీమేక్) సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా స్టార్ హీరో ఉపేంద్రతో నటించే అవకాశం దక్కిందని ఆనందంతో ట్వీట్ వేసింది.

‘చంద్రలేఖ’ ఫేం ఓంప్రకాష్ గారి దర్శకత్వంలో మరోసారి అవకాశం దక్కిందని, ఉపేంద్ర సర్ తో నటిస్తున్నానని, రవిచంద్రన్ సర్ తన తండ్రి పాత్ర పోషిస్తున్నారని, ఓ మంచి క్యారెక్టర్ మళ్ళీ తన ఖాతాలో పడినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నానని… తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది శాన్వి. తెలుగులో పెద్దగా రాణించకపోయినా, కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని దక్కించుకుంది ఈ మిల్కీ బ్యూటీ.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories